ఇబ్బంది లేకుండా సాగునీరు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:29 AM
మడ్డువలస కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీరు అందించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ సిబ్బందికి సూచించారు.
ఎమ్మెల్యే కోండ్రు
మడ్డువలస నీరు విడుదల
వంగర, జూలై 24(ఆంధ్రజ్యోతి): మడ్డువలస కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీరు అందించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మడ్డువ లస కుడి ప్రధాన కాలువ ద్వారా ఆయన సాగునీటిని విడుదల చేశారు. ముందుగా కాలువ గేట్ల వద్ద వేద పండితులతో ప్రత్యేక పూజలు చేశారు. ఆయకట్టు పరిధిలోని 24వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని చెప్పారు. ప్రోజెక్టు నీటి పారుదల శాఖ అధికారులు ఎస్‌ఈ, డీఈ, ఏఈ మాట్లాడుతూ.. రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వంగర, రాజాం, రేగిడి, సంతకవిటి టీడీపీ నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్..
గ్రామాల్లో ప్రజలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే కోండు మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం వంగర ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులతో చర్చించి అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. నాయకులు వాసుదేవరావు, పైల వెం కటరమణ, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.