harom hara హరోంహర
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:27 AM
harom hara శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివ నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగించారు.
హరోంహర
జిల్లా అంతటా మహా శివరాత్రి పూజలు, అభిషేకాలు
భక్తులతో పోటెత్తిన ఆలయాలు
విజయనగరం కల్చరల్, ఫిబ్రవరి 15 (ఆంరఽధజ్యోతి):
శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివ నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగించారు. శివునికి నీరు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పాలు తదితర వాటితో అభిషేకాలు నిర్వహించారు. ఎస్.కోట మండలం పుణ్యగిరి, సన్యాసయ్యపాలెం (ధర్మవరం), నెల్లిమర్ల మండలం రామతీర్థం, వంగర మండలం సంగాం తదితర శైవ క్షేత్రాల్లో శివరాత్రి పూజలు అత్యంత వైభవంగా సాగాయి. పురాతన, స్వయంభూ ఆలయాలకు భక్తులు తాకిడి అధికంగా ఉండడంతో ప్రత్యేక పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పుణ్యగిరి, రామతీర్థంలో ఆదివారం రాత్రంతా భక్తుల తాకిడి నెలకొంది. విజయనగరంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, వీరరాజేశ్వర స్వామి ఆలయం (బాబామెట్ట), శివపంచాయతన ఆలయం, రింగురోడ్డులోని పశుపతి నాథేశ్వరస్వామి ఆలయం రోజంతా భక్తులతో కిటకిటలాడాయి.
- అయోధ్యమైదానంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
---------------