వైసీపీ హయాంలో సామాన్యులకు ఇబ్బందులు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:01 AM
వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి, మహారాజుల వరకు ఎవర్నీ వదలకుండా ఇబ్బందులను పెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అశోక్ గజపతిరాజును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు.
విజయనగరం, జూలై 2, (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి, మహారాజుల వరకు ఎవర్నీ వదలకుండా ఇబ్బందులను పెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అశోక్ గజపతిరాజును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. గురు వారం విజయనగరంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పూసపాటి వంశీయులు పేద విద్యార్థులు కూడా చదువుకుని ఉన్నతశిఖరాలకు చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో విద్య కోసం వందలాది ఎకరాలు కేటాయించారని తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మించిన స్థలం రాజాసాహెబ్ విజయనగరం పేరిట టౌన్ రికార్డులో ఉందన్నారు. అందుకు సంబందించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని ప్రదర్శించారు. ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా బదలాయించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. ఒకవేళ మార్చే అవకా శం ఉంటే తహసీల్దారుకు అధికారం ఎక్కడ ఉందని నిలదీశారు. ఈ అంశంపై పూస పాటి వారి కుటుంబానికి ప్రజల మద్దతు ఉందన్నారు. కిమిడి నాగార్జున మాట్లాడు తూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు తవ్వకూడదన్న నిబంధనలను వైసీపీ తుంగలోకి తొక్కిందని విమర్శించారు.