Share News

వేధింపులు తగవు

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:05 AM

రెవెన్యూ ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులను నిరసిస్తూ జిల్లాలోని పలు చోట్ల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సచివాలయ సర్వే సహాయకులు సోమవారం ధర్నా చేపట్టారు.

వేధింపులు తగవు

  • జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

రెవెన్యూ ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులను నిరసిస్తూ జిల్లాలోని పలు చోట్ల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సచివాలయ సర్వే సహాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లి వీఆర్వో ఉన్నతాధికారుల వేధిం పులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలి పారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరస న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Jun 09 , 2026 | 12:05 AM