Share News

హ్యాపీ సండేకు స్పందన కరువు

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:24 AM

రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతినెల రెండవ, నాలుగ వ ఆదివారాలలో కార్పొరేషన్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమానికి స్పందన కరువు అవుతోంది.

హ్యాపీ సండేకు స్పందన కరువు

  • కానరాని జనాలు

విజయనగరం టౌన్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతినెల రెండవ, నాలుగ వ ఆదివారాలలో కార్పొరేషన్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమానికి స్పందన కరువు అవుతోంది. నగరంలోని రాజీవ్‌ క్రీడా మైదా నంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్ర మానికి ఎవరూ హాజరు కాలేదు. దీంతో మైదానం లో వాకింగ్‌ చేసున్నవారిని మెప్మా అధికారులు పిలవగా కొంతమంది వచ్చి కూర్చొన్నారు. సహాయ కమిషనర్‌ అప్పలరాజు వచ్చి, వేదికపైన ప్రసగించి నప్పుడు కూడా ప్రజలు లేక వేదిక అంతా వెలవెల బోయింది. ఇదే విషయమై కార్యక్రమ నిర్వాహకుడు డీఈ శ్రీనివాస్‌ వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడు తున్నామని చెప్పారు. కుర్చీలు తప్పా ఇతర మెటీరి యల్‌ అంతా కార్పొరేషన్‌కు సంబంధించింది. ఇతర ఖర్చు లకు సంబంధించి రూ.15వేలు వరకూ అవు తోంది. రెండు నెలలకు ఒకసారి బిల్లులు పెడతామని ఆయన తెలిపారు.

Updated Date - Mar 09 , 2026 | 12:24 AM