Share News

హ్యాపీ జర్నీ.. సేఫ్‌ జర్నీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:29 AM

రహదారి భద్రతపై ప్రయాణికులకు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.

హ్యాపీ జర్నీ.. సేఫ్‌ జర్నీ
కొత్తవలస జంక్షన్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తున్న పోలీసులు

- ప్రయాణికులకు పోలీసుల అవగాహన - ప్లకార్డుల ప్రదర్శన

నెల్లిమర్ల, జనవరి 17(ఆంధ్రజ్యోతి):రహదారి భద్రతపై ప్రయాణికులకు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ఎస్‌ఐ బి.గణేష్‌ ఆధ్వర్యంలో హ్యాపీ జర్నీ-సేఫ్‌ జర్నీ పేరుతో శనివారం ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి సూచనలు, సలహాలు వాహనదారు లకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్‌ఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం ఈ కార్య క్రమం చేపట్టినట్టు తెలిపారు.

కొత్తవలస, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చినవారు తిరిగి సురక్షితంగా తమ ఇళ్లకు చేరాలంటూ కొత్తవలస పోలీసులు అవగాహన కల్పిం చారు. ఈ మేరకు కొత్తవలస జంక్షన్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. సురక్షిత ప్రయాణం శుభం కలిగించాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా తిరిగి రండి, సంతోష కరమైన ప్రయాణం కావాలి, మీ రాక కోసం ఎదురు చూస్తున్న హృదయాలంటూ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. దూర ప్రయాణాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కొత్తవలస సీఐ షణ్ముఖరావు, ఎస్‌ఐ జోగారావు, సిబ్బంది పాల్గొన్నారు.

రేగిడి, జనవరి 17(ఆంరఽధజ్యోతి): ఉంగరాడ మెట్ట కూడలి, బూరాడ సెంటర్‌లో ఎస్‌ఐ బాల కృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులకు రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. హెల్మెట్‌ వినియోగించాలని, అతివేగం ప్రమాదమని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, సీటు బెల్టు పెట్టుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

Updated Date - Jan 18 , 2026 | 12:29 AM