Share News

happy.. happy సందడిగా..

ABN , Publish Date - May 12 , 2026 | 12:25 AM

happy.. happy టీడీపీ జిల్లా కార్యాలయ భవనానికి కీలక అడుగు పడింది. శ్రేణులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజే రానే వచ్చింది. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో సందడిగా భూమి పూజ జరిగింది.

happy.. happy సందడిగా..

సందడిగా..

టీడీపీ జిల్లా కార్యాలయ భవనానికి శంకుస్థాపన

హాజరైన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు

విజయనగరం, మే 11 ( ఆంధ్రజ్యోతి):

టీడీపీ జిల్లా కార్యాలయ భవనానికి కీలక అడుగు పడింది. శ్రేణులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజే రానే వచ్చింది. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో సందడిగా భూమి పూజ జరిగింది. విజయనగరం శివార్లలో రెండెకరాల స్థలంలో భవన నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సోమవారం ఇందుకు శ్రీకారం చుట్టారు. పూజలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల ప్రసాద్‌, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు, ఐవీపీ రాజు, కరణం శివరామకృష్ణ, సువ్వాడ వనజాక్షితో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యకర్తలకు దేవాలయం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం అంటే టీడీపీ కార్యకర్తలకు దేవాలయం వంటిదన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని, అదే ఆశయాలతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. పార్టీ ఆరంభం నుంచి ఇప్పటివరకు వరకూ అశోక్‌ గజపతిరాజు నివాసమే పార్టీ కార్యాలయంగా వినియోగించామన్నారు. తాజాగా ప్రభుత్వం స్థలం కేటాయించడంతో కార్యాలయ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని, ప్రజల పక్షాన నిలిచి ముందుకు నడుస్తోందని అన్నారు. ఏడాది లోపే పార్టీ కార్యాలయ భవనం పూర్తి అవుతుందని చెప్పారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాలోకేష్‌ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనడానికి పార్టీ నూతన కార్యాలయం నిర్మాణమే నిదర్శనమన్నారు.

అధునాతనంగా..

విజయనగరం, మే 11 ( ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ భవనం అధునాతన సౌకర్యాలతో నిర్మితం కానుంది. ఏడాదిలోపే పూర్తి అయ్యేలా పార్టీ జిల్లా నేతలు చొరవ తీసుకుంటున్నారు. జీ ప్లస్‌ 1 తరహాలో షేర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మాణం సాగనుంది. రెండెకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక హాల్‌ (500 మంది కూర్చునే విధంగా), వేర్వేరు ప్రత్యేక గదులు, సెమినార్‌ హాలు కలిపి 7,650 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మాణం జరుగనుంది. ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్లే చోట మంగళగిరి పార్టీ కార్యాలయం తరహాలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు కానుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి కార్యాలయం, పీజీఆర్‌ రూమ్స్‌, వీఐపీ వెయిటింగ్‌ రూం, భారీ ఓపెన్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ తదితర వాటి నిర్మాణం చేపడతారు. 50 శాతం పనులు అక్టోబరు ఆఖరుకు పూర్తి చేయాలనుకుంటున్నారు.

Updated Date - May 12 , 2026 | 12:25 AM