మృతుడి కుటుంబానికి చెక్కు అందజేత
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:28 AM
సాలూ రు రూరల్ ఏఎస్‌ఐ ఆర్.ఆదినారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఎస్‌బీఐ నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు.
పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): సాలూ రు రూరల్ ఏఎస్‌ఐ ఆర్.ఆదినారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఎస్‌బీఐ నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ స్టేట్ బ్యాంకు పోలీసు సాలరీ ప్యాకేజీని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎవరైనా పోలీసు ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబానికి బ్యాంకు ఆర్థిక సాయం అందజేయనుందన్నారు. గతేడాది ఆగస్టు 8న ఆదినారాయణ మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్య పద్మావతికి బ్యాంకు అధికారుల సమ క్షంలో చెక్కును అందజేశామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఎస్పీ సీఐ రమణమూర్తి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, పార్వతీపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఎం.ఆర్.దత్, డిప్యూటీ మేనేజర్ వేణుగోపాల్, ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.