Share News

Hall Tickets via WhatsApp వాట్సాప్‌లో హాల్‌టిక్కెట్లు పొందొచ్చు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:25 AM

Hall Tickets Can Be Obtained via WhatsApp వచ్చేనెల 2 నుంచి జరగనున్న ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి హాల్‌ టిక్కెట్లను మన మిత్ర వాట్సాప్‌ లేదా స్టడీ సెంటర్ల నుంచి పొందొచ్చని డీఈవో బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Hall Tickets  via WhatsApp వాట్సాప్‌లో హాల్‌టిక్కెట్లు పొందొచ్చు

పార్వతీపురం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 2 నుంచి జరగనున్న ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి హాల్‌ టిక్కెట్లను మన మిత్ర వాట్సాప్‌ లేదా స్టడీ సెంటర్ల నుంచి పొందొచ్చని డీఈవో బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్లలో ఈ వాట్సాప్‌ గవర్నెన్స్‌ 95523 00009 నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ పంపాలన్నారు. అనంతరం అందులో విద్యాశాఖకు సంబంధించిన సేవలు ఎంచుకోవాలని పేర్కొన్నారు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పబ్లిక్‌ ఎగ్జామిసేషన్స్‌ మార్చి 2026 హాల్‌ టిక్కెట్లు సెలక్ట్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని వెల్లడించారు. విద్యార్థి అడ్మిషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:25 AM