Share News

జనరేటర్‌లో జుట్టు ఇరుక్కుపోయి..

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:16 AM

దత్తి గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆల య వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ఊరేగింపులో అప శృతి చోటుచేసుకుంది.

జనరేటర్‌లో జుట్టు ఇరుక్కుపోయి..

దత్తిరాజేరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): దత్తి గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆల య వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ఊరేగింపులో అప శృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో లైటింగ్‌ కోసం జనరేటర్‌ ఏర్పాటుచేశారు. అయితే అదే గ్రామానికి చెందిన తరిని మాధురి అనే మహిళ ఆ జనరేటర్‌ పక్కగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆమె జుట్టు జనరేటర్‌లోకి ఇరు క్కుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె జుట్టుతోపాటు తలపై చర్మం ఊడి వచ్చిం ది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే గ్రామస్థులు విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:16 AM