భారతమాతకు జై
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:34 PM
: కురుపాంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది.
-కురుపాంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
- 250 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన
కురుపాం, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): కురుపాంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. స్థానిక రావాడ రోడ్డు జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ధూళికేశ్వరస్వామి వరకు 250 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. కలెక్టర్, ఎమ్మెల్యే సైకిల్ తొక్కుతూ, పాదయాత్రగా సాగుతూ పౌరుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.