Guru Naidu's strength in weightlifting వెయిట్ లిఫ్టింగ్‌లో గురునాయుడు సత్తా
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:29 PM
Guru Naidu's strength in weightlifting ఏసియన్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మరడలం చందకపేట గ్రామానికి చెందిన శనాపతి రామస్వామి కుమారుడు గురునాయుడు సత్తాచాటాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం జరిగిన స్నాచ్ విభాగంలో 110 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 146 కిలోలు ఎత్తి మొత్తం 256 కిలోల బరువు నమోదు చేశాడు.
వెయిట్ లిఫ్టింగ్‌లో గురునాయుడు సత్తా
- ఏసియన్ గేమ్స్‌లో మూడు సిల్వర్ పతకాల గెలుపు
విజయనగరం టౌన్, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): ఏసియన్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మరడలం చందకపేట గ్రామానికి చెందిన శనాపతి రామస్వామి కుమారుడు గురునాయుడు సత్తాచాటాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం జరిగిన స్నాచ్ విభాగంలో 110 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 146 కిలోలు ఎత్తి మొత్తం 256 కిలోల బరువు నమోదు చేశాడు. మూడు సిల్వర్ పతకాలను సాధించాడు. ఈ విషయం తెలిసి గ్రామస్థులతో పాటు జిల్లా క్రీడాభిమానులంతా గురునాయుడును అభినందించారు. ఈయన ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా గురునాయుడు‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్‌లో తనకు నాన్నే గురువు అని, ఆయన శిక్షణ, ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు.