Gurajada’s గురజాడ రచనలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:00 AM
Gurajada’s Writings Are Inspirational మహాకవి గురజాడ రచనలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గురజాడ అప్పారావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మహాకవి గురజాడ రచనలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గురజాడ అప్పారావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గురజాడ రచనలు, సామాజిక చైతన్యానికి, మార్పుకు పునాదులు వేశాయన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్...దేశమంటే మనుషులోయ్’ అన్న ఆయన సందేశం స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాల నిర్మూలనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. మహాకవి ఆశయాలను యువత, విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురి, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, కేఆర్‌సీ ఉప కలెక్టర్ ధర్మరాజు, డీఈవో బ్రహ్మాజీరావు, డ్వామా పీడీ రామచంద్రరావు పాల్గొన్నారు.