Share News

Gurajada's literature is timeless. గురజాడ సాహిత్యం శాశ్వతమైనది

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:38 PM

Gurajada's literature is timeless. నవయుగ వైతాళికుడు గురజాడ వెంకటఅప్పారావు సాహిత్యం శాశ్వతంగా నిలిచి ఉంటుందని, భావితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై, సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. ప్రభుత్వ ఉత్సవంగా మహాకవి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాక తొలిసారిగా సోమవారం కలెక్టరేట్‌లో సభ ఏర్పాటు చేశారు.

Gurajada's literature is timeless. గురజాడ సాహిత్యం శాశ్వతమైనది
గురజాడ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి

గురజాడ సాహిత్యం శాశ్వతమైనది

భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదీ

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఘనంగా మహాకవి 164వ జయంతి

ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహణ

విజయనగరం, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి):

నవయుగ వైతాళికుడు గురజాడ వెంకటఅప్పారావు సాహిత్యం శాశ్వతంగా నిలిచి ఉంటుందని, భావితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై, సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. ప్రభుత్వ ఉత్సవంగా మహాకవి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాక తొలిసారిగా సోమవారం కలెక్టరేట్‌లో సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌ ముందుగా గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు విలువైన గురజాడ సాహిత్యాన్ని సంరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని కోరారు. సుమారు 120 ఏళ్ల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మలేషియాకు వలసవెళ్లిన తెలుగువారి కృషిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వారంతా మలేషియాలో తెలుగు అసోసియేషన్‌గా ఏర్పడి ఇప్పటికీ మన సంస్కృతీ సంప్రదాయాలు, అలవాట్లను వారి పిల్లలకు అందజేస్తున్నారని గుర్తుచేశారు. మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గురజాడ స్వగృహం నుంచి ఆయన వినియోగించిన వస్తువులతో నగరంలో చేపట్టిన ఊరేగింపులోనూ మంత్రి పాల్గొన్నారు. ఆ ర్యాలీ గురజాడ కాంస్య విగ్రహం వరకు సాగింది.

- గురజాడ వెంకట అప్పారావు 164 జయంతి వేడుకలకు గురజాడ కుటుంబ సభ్యులు ఇందిర, మునిమనవడు వెంకటేశ్వరప్రసాద్‌, గురజాడ లలిత, గురజాడ శ్రీకర్‌ అతిథులుగా హాజరయ్యారు. వీరిని డీఆర్వో సత్తిబాబు, విజయనగరం ఆర్డీవో సుధాసాగర్‌ సాదరంగా వేదికపైకి ఆహ్వానించి తమ కుర్చీలను ఖాళీ చేసి వారిని కూర్చోబెట్టారు. ఇది చూసిన వారంతా గురజాడ కుటుంబీకులను మంచిగా గౌరవించారని అనడం వినిపించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు, ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ సేతుమాధవన్‌, డీఈవో మాణిక్యంనాయుడు, సీపీవో బాలాజీ, డిప్యూటీ కలెక్టర్‌ మురళి, గృహనిర్మాణశాఖ పీడీ మురళి తదితరులు పాల్గొన్నారు. గురజాడ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు మంత్రి బహుమతి ప్రదానం చేశారు.

Updated Date - Sep 21 , 2026 | 11:38 PM