Share News

పింఛన్‌ దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:06 PM

మన్యం జిల్లా పరిధిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకై దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సమాచార సేకరణకు ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది.

 పింఛన్‌ దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు

గరుగుబిల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా పరిధిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకై దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సమాచార సేకరణకు ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎంపీడీవోలు, సచివాలయాల సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం క్షేత్రస్థాయిలో దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను కేటాయించిన అధికారులు నిశిత పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు దారుని వయస్సు, అలాగే కుటుంబానికి సంబంధించి ఎంతమేర భూములు ఉన్నాయన్న దానిపై పరిశీలన చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు భూములు, వాహనాలలు ఉన్నాయా.. లేవా పరిశీలించనున్నారు. గృహానికి సంబంధించి గత 12 నెలలుగా ఎంతమేర విద్యుత్‌ ఉపయోగిస్తున్నారే వివరాలు సేకరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్‌ ఉద్యోగస్తులు ఉన్నారా.. లేదార.. ఆరా తీయనున్నారు. అలాగే కుటుంబంలో ఆరోగ్య, వికలాంగ పింఛన్లు పొందుతున్నారా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా, ఇతర పింఛన్లు, స్వాతంత్ర, మిలటరీ, ఈపీఎఫ్‌, తదితర పొందుతున్నారా అన్న వివరాలను పరిశీలించనున్నారు. వితంతు పింఛన్‌కు సంబంధించి భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వికలాంగులకు సదరం ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళల పింఛన్‌కై భర్త నుంచి విడిపోయినట్లయితే పత్రాలు, వివాహం కాని వారికి తహసీల్దార్‌ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సరిచూడనున్నారు. ట్రాన్‌ ్స జెండర్స్‌ పింఛన్‌కై వైద్యులు ధ్రువీకరణ పత్రం, అలాగే చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులకు సంబంధించి శాఖ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం పరిశీలించనున్నారు.

వరుస సెలవులతో ఆందోళన

సామాజిక పింఛన్లకై దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల 16 వరకు ఉంది. అయితే ప్రారంభం నుంచి సర్వర్‌ సమస్య అధికంగా నెలకొంది. దరఖాస్తు చేసుకునేందుకు అధికం గా నిరీక్షణ చేస్తున్నారు. ఇదిలాఉండగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఆందోళన నెలకొంది. ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయ చవితి పండగ ఉంది. సెలవులు కారణంగా సచివాలయాల సిబ్బంది హాజరు కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపడుతుందో వేచి చూడాలి మరి.

Updated Date - Sep 10 , 2026 | 11:06 PM