Share News

షెడ్యూల్డ్‌ గ్రామాలను వెబ్‌సైట్‌లో చేర్పునకు హామీ

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:12 AM

గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చేర్చేందుకు రాష్ట్ర

షెడ్యూల్డ్‌ గ్రామాలను వెబ్‌సైట్‌లో చేర్పునకు హామీ
సంధ్యారాణికి వినతిపత్రం అందజేస్తున్న ప్రతినిధులు

మక్కువ రూరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చేర్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారని ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మండల గిరిధర్‌ ఆధ్వర్యంలో సభ్యులు నిమ్మిక సింహాచలం మంచాల ఈశ్వరరావు, మువ్వల అప్పారావు బుధవారం అమరావతిలోని కార్యాలయంలో మంత్రి సంధ్యారాణిని కలిశారు. గిరిజన ప్రాంతంలోని గ్రామాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చేర్చాలని కోరగా అందుకు ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. గిరిజన షెడ్యూల్డ్‌ గ్రామాలను వెబ్‌సైట్‌లో చేర్చేందుకు కృషి చేస్తానని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారని గిరిధర్‌ తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 12:12 AM