Grown up a bit కాస్త పెరిగారు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:44 PM
Grown up a bit జిల్లా జనాభా స్వల్పంగా పెరిగింది. గతంలో నిర్వహించిన లెక్కలకు ఇప్పుడు చేపట్టిన ఇంటింటా సర్వేకు మధ్య పెద్దగా పెరుగుదల లేదు. జనాభా పెరుగుదల రేటు కూడా తగ్గింది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కల సేకరణ ఉంటుంది.
కాస్త పెరిగారు
జిల్లాలో జనాభా పెరుగుదల స్వల్పమే
2011తో పోలిస్తే లక్ష మంది అదనం
చీపురుపల్లిలో అత్యధికంగా నమోదు
11 మండలాల్లో తగ్గిన జనాభా
కొన్ని మండలాల్లో పెరిగిన జనాభా
జిల్లా వ్యాప్తంగా తగ్గిన గ్రోత్ రేటు
ఒకరు లేక ఇద్దరు నినాదమే కారణమా?
విజయనగరం కలెక్టరేట్, జూన్ 8(ఆంధ్రజ్యోతి):
జిల్లా జనాభా స్వల్పంగా పెరిగింది. గతంలో నిర్వహించిన లెక్కలకు ఇప్పుడు చేపట్టిన ఇంటింటా సర్వేకు మధ్య పెద్దగా పెరుగుదల లేదు. జనాభా పెరుగుదల రేటు కూడా తగ్గింది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. అయితే 2021లో కరోనా రావడంతో జనాభా లెక్కింపు ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రక్రియ నిర్వహించారు. అందులో భాగంగా ఎన్యూమరేటర్లుకు మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. జనాభా లెక్కింపులో భాగంగా గతనెల మొదటి నుంచి ఇంటింటా సమాచారం సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 3,720 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 7,12,491 గృహాలు ఉండగా వీటిల్లో 7,10,861 (99.77 శాతం) గృహాలను సర్వే చేశారు. 20,33,423 మంది జనాభా ఉన్నారు. విజయనగరం ఆర్బన్, చీపురుపల్లి మండలంలో అత్యఽధికంగా జనాభా పెరిగారు. కొన్ని మండలాల్లో స్వల్పంగా పెరగ్గా మరి కొన్ని మండలాల్లో 2011తో పోల్చితే బాగా తగ్గారు.
తగ్గిన గ్రోత్ రేట్
తాజాగా చేపట్టిన జనాభా లెక్కల ద్వారా జనాభా పెరుగుదల రేటు అంతగా పెరగలేదని నిర్ధారణ అయింది. 2011లో జిల్లాలో 19,30,811 మంది జనాభా ఉండగా ఇప్పుడు నిర్వహించిన లెక్కల్లో 20,33,423 మంది ఉన్నారు. అప్పటికీ, ఇప్పటికీ దాదాపు లక్ష మూడు వేల వరకూ జనాభా పెరిగారు. ఒకరు లేక ఇద్దరు అనే నినాదం పాటించడం వల్ల సంతానోత్పాత్తి తగ్గిందన్నది కొందరి భావనగా ఉంది. అలాగే ఇతర ప్రాంతాలకు వలసలు కూడా జనాభా తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.
మండలాల వారీగా జనాభా
మండలం 2011 జనాభా 2026 జనాభా వ్యత్యాసం
బొబ్బిలి 66,145 67,224 +1,079
తెర్లాం 59,688 60,225 +537
ఆర్‌బిపురం 50,464 52,489 +2,025
గజపతినగరం 57,529 56,388 -1,141
బాడంగి 49,384 48,061 -1,323
దత్తిరాజేరు 54,499 56,285 +1,786
మెంటాడ 46,855 47,416 +561
చీపురుపల్లి 63,408 73,097 +9,689
రాజాం 51,842 52,571 +729
రేగిడి 70,493 72,863 +2,370
గరివిడి 68,289 72,559 +4270
మెరకముడిదాం 57,237 55,811 -1426
గుర్ల 64,695 65,542 +847
సంతకవిటి 65,419 61,844 -3,575
వంగర 41,133 39,057 -2076
విజయనగరం రూరల్ 43,599 51,661 +8,062
డెంకాడ 54,382 58,869 +4487
భోగాపురం 54,891 60,416 +5,525
పూసపాటిరేగ 71,955 76,496 +4541
నెల్లిమర్ల 50,772 52,139 +1,367
గంట్యాడ 65,579 68,633 +3,054
బొండపల్లి 51,146 49,277 -1869
ఎస్.కోట 75,917 73,343 -2,574
వేపాడ 50,580 47,720 -2860
కొత్తవలస 68,579 72,010 +3,431
ఎల్.కోట 53,039 51,126 -1913
జామి 58,066 55,299 -2767
విజయనగరం అర్బన్ 2,39,951 2,98.877 + 58,926
==============