Green signal for ward reservation వార్డుల రిజర్వేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:05 AM
Green signal for ward reservation రెండు దశాబ్దాలుగా ఎన్నికలకు నోచుకోని రాజాం మున్సిపాలిటీలో నోటిఫికేషన్ రావడమే తరువాయి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మున్సిపల్ యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.
వార్డుల రిజర్వేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
రాజాం మున్సిపాలిటీలో తేలిన లెక్కలు
24 నుంచి 32కు పెంపు
కులాల వారీగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి
రాజాం రూరల్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాలుగా ఎన్నికలకు నోచుకోని రాజాం మున్సిపాలిటీలో నోటిఫికేషన్ రావడమే తరువాయి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మున్సిపల్ యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల సంఖ్యను 24 నుంచి 32కి పెంచారు. మున్సిపాలిటీ పరిధిలోని ఐదు గ్రామాలలో 36,786 మంది ఓటర్లున్నట్లు నిర్ధారించారు. వీరిలో 25,175 మంది బీసీలు, 4530 మంది ఎస్సీలు, 435 మంది ఎస్టీలు, 6646 మంది ఓపెన్‌కేటగిరీ ఓటర్లున్నారు. ఇదే సమయంలో వార్డులవారీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్ కేటగిరీల ఓటర్లసంఖ్యను ఖరారు చేశారు. వార్డుల్లో ఉన్న కులాల సంఖ్య ఆధారంగా ఏవార్డు ఏ కులానికి రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయో, తమకు పోటీచేసే అవకాశం దక్కుతుందో లేదోనని కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న వారు లెక్కలు వేసుకుంటున్నారు.
- మున్సిపాలిటీలోని 32 వార్డులలో 2, 4, 10, 13, 17, 18, 20, 24, 29 వార్డులు బీసీలకు, 1, 3, 6, 7, 8, 9, 12, 14, 15, 16, 22, 23, 25, 26, 31, 32 వార్డులు ఓసీలకు, 5, 11, 27, 28, 30 వార్డులు ఎస్సీలకు, 19, 21 వార్డులు ఎస్టీలకు అనుకూలంగా ఉన్నాయి. అయితే సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్ శాతం, ఆయా వార్డులలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా అధికారికంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
--------------