గ్రీన్ అంబాసీడర్లకు జీతాలు చెల్లించాలి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:20 AM
మునిసిపల్ కార్మికులకు చెల్లించే విధంగా పంచాయతీ గ్రీన్ అంబాసీడర్లకు జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ డిమాండ్ చేశారు.
రాజాం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికులకు చెల్లించే విధంగా పంచాయతీ గ్రీన్ అంబాసీడర్లకు జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం రాజాం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రీన్‌అంబాసీడర్లతో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ మునిసిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు రూ.21వేలు జీతం చెల్లించా లని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ అలవెన్స్ రూ.ఆరు వేలు చెల్లించాలని కోరారు.అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవో వి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రీన్‌అంబాసీడర్ల యూనియన్ నాయకులు శివ, నాగమణి, టి.రాము, ఎం.దాలయ్య. సీహెచ్ వెంకన్న, బి.అసిరమ్మ, పాపారావు, దుర్గ, నాగయ్య పాల్గొన్నారు.