Share News

పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయండి

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:17 AM

జిల్లాలోని పరిశ్రమలకు త్వరగా అనుమతులు మంజూ రు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయండి

విజయనగరం, కలెక్టరేట్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పరిశ్రమలకు త్వరగా అనుమతులు మంజూ రు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖాధికారులతో పరిశ్ర మలు, ఎగుమతులు, పోత్సాహక కమిటీపై వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలనకు నిర్ణయించిన గడువు వరకూ వేచి ఉండకుండా వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే సంబందిత శాఖతో సమన్వయం చేసుకుని, త్వరగా అమనుతులు వచ్చేలా చూడాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు. పెట్టుబడుదారులకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభు త్వం పీఎంఈజీపీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడి గించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు కమా లాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సిద్ధం చేయాలి..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితిలో ఖరీఫ్‌ సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడానికి రైతులను సిద్ధం చేయాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించా రు. శనివారం వెబెక్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సన్నద్ధతపై సమీక్షించారు. వచ్చే నెల మొదటగి వారంలో విత్త న కాలంలో ముగిసే అవకాశం ఉన్నందున, రైతు లకు అవసరమైన విత్తనాలు ముందుగానే అందు బాటులో ఉంచాలన్నారు. వర్షాబావ పరిస్ధితుల్లో తక్కు వ నీటి అవసరమయ్యే రాగి, జనుము, ఉలవలు, పెస లు వంటి ప్రత్యామ్నాయ పంటలను స్థానిక పరిస్థితు లకు అనుగుణంగా సాగు చేసేలా రైతులకు అవగా హన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాసం, కూరగాయల పంటలు సాగును ప్రోత్సహించాలన్నా రు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొ నేందుకు శాఖల వారీగా కాకుండా సమన్వ యంతో ప్రాధాన్యతా క్రమం లో కార్యచరణ రూపొందిం చాలని ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక్క ఎకరా పంట విస్తీర్ణం కూడా తగ్గకుం డా అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు నష్టం కలగకుండా చూడాలని సూచించారు. రైతులకు ప్రత్నామ్నాయ పంటలు, అందుబాటులో ఉన్న విత్తనాలు, సాగు పద్ధతులు, సహాయ చర్యలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు మండల స్థాయిలో సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

Updated Date - Aug 30 , 2026 | 12:17 AM