Share News

‘మాస్‌లీవ్‌ మంజూరు చేయండి’

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:53 PM

మాస్‌లీవ్‌ మంజూరుచేయాలని నెల్లిమర్ల ఎంఆర్సీ సిబ్బంది కోరారు. ఈ మేరకు బుధవారం ఎంఈవో యూఎస్‌ఎన్‌మూర్తికి వినతిపత్రం అందజేశారు.

 ‘మాస్‌లీవ్‌ మంజూరు చేయండి’
ఎంఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎంఆర్సీ సిబ్బంది

నెల్లిమర్ల, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మాస్‌లీవ్‌ మంజూరుచేయాలని నెల్లిమర్ల ఎంఆర్సీ సిబ్బంది కోరారు. ఈ మేరకు బుధవారం ఎంఈవో యూఎస్‌ఎన్‌మూర్తికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సమగ్రశిక్షా ఉద్యోగులు చేపడుతున్న చలో విజయవాడ కార్య క్రమానికి నెల్లిమర్ల ఎంఆర్సీ సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా స్టేట్‌ జేఏసీ సభ్యుడు ఆరికతోట రామకృష్ణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమగ్రశిక్షా ఉద్యోగులు విజయవాడకు వెళ్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్డీఏ ఎన్‌.పార్వతీ, ఎంఐఎస్‌ ఎం.ప్రశాంతి, మెసెంజర్‌ గోవిందమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:53 PM