ఘనంగా సరస్వతీదేవి విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:21 AM
పట్టణంలోని తారకరామా కాలనీలోని పాఠశాలలో గుంప కృష్ణమూర్తి జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే బేబీనాయన ఆవిష్కరించారు.
బొబ్బిలి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తారకరామా కాలనీలోని పాఠశాలలో గుంప కృష్ణమూర్తి జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే బేబీనాయన ఆవిష్కరించారు. అలాగే.. రూట్స్ అండ్ వింగ్స్ ట్రైబల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపాధ్యాయురాలు చిట్టిమోజు ఉషారాణి రూపొందించిన పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ కల్యాణి, ఎంఈవోలు, తారకరామా కాలనీ, చిక్కాల రెల్లివీధి పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.