Ceremony ఘనంగా ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:55 PM
Grand Swearing-In Ceremony టీడీపీ నూతన కార్యకర్గ ప్రమాణ స్వీకారం బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పమాణ స్వీకారం చేసిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, రాష్ట్ర కార్యదర్శులుగా బొంగు సురేష్, బిడ్డిక పద్మావతి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వీరేష్ చంద్రదేవ్
కార్యదర్శులుగా సురేష్, పద్మావతి
సాలూరు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ నూతన కార్యకర్గ ప్రమాణ స్వీకారం బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పమాణ స్వీకారం చేసిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, రాష్ట్ర కార్యదర్శులుగా బొంగు సురేష్, బిడ్డిక పద్మావతి తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఒక మారుమూల గిరిజన నియోజకవర్గానికి చెందిన తనకు పొలిట్ బ్యూరోలో రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ ఇచ్చే అత్యున్నతమైన గౌరవం, ప్రోత్సాహంగా భావిస్తానని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు. అనంతరం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
- జియ్యమ్మవలస: తనకు ఇంతటి అవకాశం కల్పించి.. పార్టీలో సముచిత స్థానం ఇచ్చిన సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌కు రాష్ట్ర కార్యదర్శి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా తనకు సహకరించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.