Share News

Pedapolamamba ఘనంగా పెదపోలమాంబ అంపకోత్సవం

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:04 AM

Grand Pedapolamamba Temple Festival Celebrated with Grandeur ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త అయిన పెద పోలమాంబ అంపకోత్సవాన్ని మంగళవారం శంబరలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు చదురుగుడి నుంచి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా దారిపొడువునా ఘటాలకు భక్తులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.

 Pedapolamamba    ఘనంగా పెదపోలమాంబ అంపకోత్సవం
అమ్మవారి ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం

మక్కువ రూరల్‌, జనవరి6(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త అయిన పెద పోలమాంబ అంపకోత్సవాన్ని మంగళవారం శంబరలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు చదురుగుడి నుంచి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా దారిపొడువునా ఘటాలకు భక్తులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని పలు వీధుల మీదుగా అమ్మవారి ఊరేగింపు సాగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గద్దెకు చేరుకుంది. బుధవారం పెదపోలమాంబ అనుపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం నుంచి శంబర జాతరలో భాగంగా 12న పోలమాంబను గ్రామంలోకి తీసుకొచ్చేందుకు చాటింపు వేయనున్నారు. కాగా ఈ అంపకోత్సవంలో ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చినతిరుపతి, ఈవో బి.శ్రీనివాసరావు, సర్పంచ్‌ సింహాచల మమ్మ, ఎంపీటీసీ పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:04 AM