Share News

గణేశుడికి మహా నైవేద్యం

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:30 AM

పట్టణంలోని ముత్తావారి వీధిలోని ఏర్పాటైన గణేశ పూజా మండపంలో శుక్రవారం సాయంత్రం స్వామివారికి స్థానిక మహిళలు మహా నైవేద్యం సమర్పించారు.

 గణేశుడికి మహా నైవేద్యం
గణేశుడికి సమర్పించిన పిండి వంటలు, పండ్లు

పార్వతీపురం టౌన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ముత్తావారి వీధిలోని ఏర్పాటైన గణేశ పూజా మండపంలో శుక్రవారం సాయంత్రం స్వామివారికి స్థానిక మహిళలు మహా నైవేద్యం సమర్పించారు. శివాజీ మహరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 రకాల పిండి వంటలు, 21 రకాల పండ్లను స్వామివారికి మేళతాళాల మధ్య సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి.చిన్నారావు, ఎం.శ్రీనివాసరావు, శివాజీ మహరాజ్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:30 AM