Share News

Minister Lokesh’s Birthday ఘనంగా మంత్రి లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:50 PM

Grand Celebrations of Minister Lokesh’s Birthday రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను సాలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పట్టణంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

  Minister Lokesh’s Birthday ఘనంగా మంత్రి లోకేశ్‌ జన్మదిన వేడుకలు
సాలూరులో పూజలు చేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జనవరి23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను సాలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పట్టణంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధితోపాటు విద్యా, ఐటీ రంగాల్లో మంత్రి నారా లోకేశ్‌ చూపుతున్న అంకితభావం అభినందనీయమన్నారు. అందర్నీ సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు చిన్నారుల భవితకు బంగారు బాట వేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు లోకేశ్‌ అని తెలిపారు. ఆయన విజన్‌ రాష్ట్రానికి అత్యంత అవసరమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అడుగుజాడల్లో నడుస్తూ.. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు లోకేశ్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్వతీపురంలో..

పార్వతీపురం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:50 PM