Share News

భక్తిశ్రద్ధలతో పాలకావిళ్ల మహోత్సవం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:20 AM

పట్టణంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సాలూరుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారులు పాలకావిళ్లతో ఊరేగింపు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో పాలకావిళ్ల మహోత్సవం
అయ్యప్ప స్వాములకు పాలు పోస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సాలూరుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారులు పాలకావిళ్లతో ఊరేగింపు నిర్వహించారు. పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో వారికి ఆహ్వానం పలుకుతూ హారతులు పట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బిందెతో పాలను పాలకావిళ్లలో పోసి వారందరినీ అభినందించారు. అనంతరం పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయానికి చేరుకుని స్వామికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:20 AM