Anupotsavam ఘనంగా అనుపోత్సవం
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:43 PM
Grand Anupotsavam Celebrated శంబర జాతరలో చివరి ఘట్టం.. పోలమాంబ అనుపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. తొలుత చదురుగుడి నుంచి గ్రామంలోని నడివీధికి అమ్మవారి ఘటాలను తీసుకొచ్చారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించారు.
3న మారు జాతర
మక్కువ రూరల్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): శంబర జాతరలో చివరి ఘట్టం.. పోలమాంబ అనుపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. తొలుత చదురుగుడి నుంచి గ్రామంలోని నడివీధికి అమ్మవారి ఘటాలను తీసుకొచ్చారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. మరోవైపు భక్తుల కోలాహలం మధ్య పోలమాంబ గద్దె నుంచి ఘటాలు ఊరేగింపుగా వనంగుడికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు , భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఘటాల ఊరేగింపులో తప్పెటగుళ్లు, మహిళల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు, పలు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పోలమాంబ దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు వనం, చదురుగుడి క్యూలైన్లలో బారులు దీరారు. కాగా వచ్చే నెల3న మారుజాతర నిర్వహిం చనున్నట్లు ఆలయ ఈవో బి.శ్రీనివాస్, పోలమాంబ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ చినతిరుపతి తెలిపారు. మరో తొమ్మిది వారాల పాటు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. మారు జాతరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.