సమగ్రాభివృద్ధికి జీపీడీపీ కీలకం: ఎంపీడీవో
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:11 AM
గ్రామాల సమగ్రామభివృద్ధికి జీపీడీపీ కీలక మని బొబ్బిలి ఎంపీడీవో పి.రవికుమార్ తెలిపా రు.
బొబ్బిలి రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్రామభివృద్ధికి జీపీడీపీ కీలక మని బొబ్బిలి ఎంపీడీవో పి.రవికుమార్ తెలిపా రు. గురువారం బొబ్బిలి మండల పరిషత్ సమావేశమందిరంలో 2026-27 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ (జీపీడీపీ) రూపకల్పనపై మండలంలోని అధికారులు, పంచాయతీకార్యద ర్శులకు శిక్షణ నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో కృష్ణమ్మ, జీఎస్‌డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళి పాల్గొన్నారు.
పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదు
పనుల్లో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని, నిర్ధేశిత గడువులోగా ప్రమా ణాలతో తప్పులు లేకుండా ఓటర్ల జాబితా తయారు చేయాలని అధికారులు, సిబ్బం దిని ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని మెట్టవలస, పారాది, కాసిందొరవలస, గొర్లెసీతారాంపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఒటు హక్కు కల్పించాలని, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్వోలను ఆదేశించారు.