Share News

ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే

ABN , Publish Date - May 14 , 2026 | 12:21 AM

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితిగజపతిరాజు అన్నారు.

  ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అదితి తదితరులు

విజయనగరం, మే 13 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితిగజపతిరాజు అన్నారు. బుధవారం ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాకు సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 16న నగరంలోని కోటలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువకులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ కార్యాలయ కార్యదర్శి పూసపాటి రాజేష్‌ వర్మ, టీడీపీ నగర అధ్యక్షులు గంటా రవి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పాసి అప్పలనాయుడు, టౌన్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పీతల కోదండరామ్‌ యాదవ్‌, రాష్ట్ర మహిళా కార్యదర్శి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:21 AM