‘రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి’
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:18 AM
రహదారుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నా రు.
విజయనగరం రూరల్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రహదారుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నా రు. స్థానిక అంబేడ్కర్ జంక్షన్, దాసన్నపేట రైతు బజా రు జంక్షన్ మీదుగా కొత్తపేట నీళ్ల ట్యాంకు వరకూ రూ.3కోట్లతో 4.30 కిలోమీటర్లు మేర చేపట్టనున్న రోడ్డు పనులకు రింగురోడ్డులోని షిర్డీసాయి ఆలయం సమీ పంలో గురువారం వారు శంకుస్థాపన చేశారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తోందని చెప్పారు. ఎంపీ మాట్లాడు తూ విజయనగరం పార్లమెంటు పరిధిలో ని అన్ని రోడ్లను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. అలాగే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్‌ను విడుద ల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, బీజేపీ నాయకుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, గంటా రవి, అనురాధ బేగం, పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.