‘అంగన్‌వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:27 AM
అంగన్‌వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ కృషి చేస్తోందని ప్రజాప్రతినిధులు అన్నారు.
అంగన్‌వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ కృషి చేస్తోందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఈసందర్భంగా వారు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు.
చిరుద్యోగుల సంక్షేమం..
ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యక ర్తలు, చిరుద్యోగుల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకట న విడుదల చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు వేతనాలు పెంచి న ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షల నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
అంగన్‌వాడీలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూరల్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యకర్తలకు అండగా ప్రభుత్వం నిలబడిం దని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ఆమె ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడు తూ గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలి సారిగా రెండు సార్లు అంగన్‌వాడీ వేతనాలు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. గ్రాడ్యూటీ చెల్లింపుల కోసం 2025 బడ్జెట్‌లోనే రూ.20కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు.
‘హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’
పూసపాటిరేగ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. ఆదివారం వెంపడాం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ప్రభుత్వం అంగన్‌వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిదన్నారు. ఎన్నికల్లో అంగన్‌వాడీలకు ఇచ్చిన ప్రతిహామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు పిన్నింటి సన్యాశినాయుడు, పిన్నింటి శ్రీనివాసరావు, దంగా భూలోక పాల్గొన్నారు.