Share News

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - May 16 , 2026 | 12:28 AM

ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వా రా పాఠశాలు బలోపేతం అయ్యేందుకు సహకరించాల ని డీఈవో యు.మాణిక్యంనాయుడు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

రాజాం రూరల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వా రా పాఠశాలు బలోపేతం అయ్యేందుకు సహకరించాల ని డీఈవో యు.మాణిక్యంనాయుడు పిలుపునిచ్చారు. రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వ హించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన గొర్లె సాత్వక్‌ (595), సుంకర గిరీష్‌ (593), అడపా హర్షిత (589), ఆగూరు పవన్‌ (589), పూరేటి లావణ్య (587), బనిశెట్టి లహరి (582), ఎడ్ల మౌనిక(580) తదితర విద్యార్థులను ఆయ న సన్మానించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అం తకుముందు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంఈవోలు ప్రవీణ్‌ కుమార్‌, దుర్గారావు, ప్రసాదరావు, శాంతికుమారి, భాస్కరరావు, గణేష్‌నా యుడు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాజాంశాఖ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌ కుమార్‌, ఇన్‌చార్జి హెచ్‌ఎం అచ్యుత కుమార్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:28 AM