Government Schools ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:49 PM
Government Schools Must Be Transformed Remarkably జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాశాఖాధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘బడి పిలుస్తోంది’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పార్వతీపురం, ఏప్రిల్22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాశాఖాధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘బడి పిలుస్తోంది’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల ‘ముస్తాబు’పై ప్రతిఒక్కరూ దృష్టి కేంద్రీకరించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు వారు ఇష్టపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు నిర్వహించాలని సూచించారు. ప్రతి శనివారం నోబ్యాగ్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లల్లో ఉత్సాహం నింపాలన్నారు. బడి ఈడు పిల్లలు బయట ఉండరాదని, వారిని పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర జిల్లాల నుంచి మన్యానికి వచ్చిన నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలను కొమరాడ, పాచిపెంట, గరుగుబిల్లి, కురుపాం మండలాలల్లో నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, డీఈవో పి.బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.