Share News

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN , Publish Date - May 06 , 2026 | 12:29 AM

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం/బెలగాం, మే 5 (ఆంధ్ర జ్యోతి): విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లోని మన్యం కళావేదికలో 2026లో జిల్లాలోని పదో తరగతి టాపర్స్‌కు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. అతిఽ థులుగా ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర, జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలలో నాలుగోసారి జిల్లాకు మొదటి ర్యాంక్‌ రావడం అభినందనీయమన్నారు. నాలుగోసారి మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించిందన్నారు. మొత్తం జిల్లా నుంచి 10,500 మంది పరీక్షలకు హాజరుకాగా 9 వేల మంది విద్యార్థులు ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అంతేకాకుండా 500 మంది విద్యార్థులు 590పైగా మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు రావ డానికి జిల్లా యంత్రాం గం సాయంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రుల కృషి వల్లే సాధ్యమైందన్నారు. మొత్తం జిల్లాలో 216 పాఠశాలలకు గాను 113 పాఠశాలలకు 100శాతం ఉత్తీర్ణత సాధించాయ న్నారు. గత విద్యాసంవత్సరం 93.90శాతం సాధిస్తే ఈ సంవత్సరం 96.07 శాతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారన్నారు. 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయు లేనని, వారి కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడం హర్షణీయ మన్నారు. అనంతరం జిల్లాలోని టాఫర్స్‌ను సత్కరించారు. జియ్యంవలస మండలం బీజేపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బడే సృజన 593 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్‌గా నిలిచింది. వీరఘట్టం మండలం తలవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బౌరోతు తరణి, బలిజిపేట మండలం పెదపెంకి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పూసర్ల దుర్గా శిరీష 591 మార్కులతో జిల్లా రెండో ర్యాంక్‌లు సాధించారు. జిల్లాలో టాపర్లుగా నిలిచిన మొత్తం 33 మందిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:29 AM