ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:53 PM
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలే వారధులని చెప్పారు.
కొత్తవలస, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలే వారధులని చెప్పారు. మండలంలోని దేశపాత్రునిపాలెం సమీపంలో బుధవారం టీడీపీ మండలాధ్యక్షుడు కోళ్ల వెంకట రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో దాసరి రాష్ట్ర సంక్షేమశాఖ కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, నాయకులు కనకాల శివ, గొరపల్లి రాము, నక్కరాజు చినరాము, కొరుపోలు అప్పారావు, పిల్లా అప్పలరాజు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
లక్కవరపుకోట, జూన్ 10(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిభరోసా ఇచ్చారు. బుధవారం ఆమె స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతున్న ఆర్.మల్లిఖార్జునరావు, జి.అర్జున్‌లను కలిశారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
ఎస్.కోట రూరల్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): సీఎం ప్రవేశపెట్టిన పీ-4 ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. మం డలంలోని భవానీనగర్‌లో ఏర్పాటుచేసిన టైలరింగ్ కార్యక్రమం ప్రారంభించారు.