ప్రభుత్వ భూములను గుర్తించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:00 AM
ప్రభుత్వ, పారిశ్రామిక అవసరా లకోసం మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూములు అందజేస్తున్న రైతులను ఒప్పించాలని, పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లభిస్తుందని వారికి నచ్చచెప్పాలని సూచించారు. సమావేశంలోని డీఆర్‌వో చందక సత్తిబాబు, ఆర్డీవోలు వెంకటేశ్వరరావు, సుధాసాగర్, మోహనరావు పాల్గొన్నారు.
విజయనగరం కలెక్టరేట్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ, పారిశ్రామిక అవసరా లకోసం మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూములు అందజేస్తున్న రైతులను ఒప్పించాలని, పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లభిస్తుందని వారికి నచ్చచెప్పాలని సూచించారు. సమావేశంలోని డీఆర్‌వో చందక సత్తిబాబు, ఆర్డీవోలు వెంకటేశ్వరరావు, సుధాసాగర్, మోహనరావు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: జేసీ
రెవెన్యూ అంశాలకు సంబందించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరతగతిన పరిష్కరించాలని జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. బుధవారం రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వే పనుల్లో వేగం పెంచాలని, ఎక్కడా జాప్యం జరగకుండా గడువులోగా సర్వే చేయాలన్నారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా మండలాలు నుంచి వచ్చిన 22ఏ నివేదిత భూములు జాబితా దరఖాస్తుల పరిష్కార స్థితిగతులపై ఆయన ఆరాతీశారు.