Share News

Government Goals ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:06 AM

Government Goals Must Be Achieved ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. సోమవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో రాష్ర్టీయ పోషణ మాసం కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 179 అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు.

Government Goals  ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి
నియామక పత్రాలు అందుకున్న వారితో మంత్రి సంఽధ్యారాణి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు

  • పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి

  • గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై దృష్టి సారించండి

  • నూతనంగా 179 మందికి నియామక పత్రాలు అందజేత

పార్వతీపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. సోమవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో రాష్ర్టీయ పోషణ మాసం కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 179 అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. చిన్నారులను కంటికి రెప్పగా చూసుకోవాలి. ఎంతో నమ్మకంతో పిల్లలను తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. అయితే అదే నమ్మకంతో అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారులను సొంత పిల్లల కంటే బాగా చూసుకోవాలి. కేంద్రాల్లో ప్రతి శుక్రవారం పిల్లల తల్లులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు ఇతర వివరాలను తెలియజేయాలి. చిన్నారుల ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. మునగాకు ప్రాముఖ్యతను తల్లులకు వివరించాలి. గ్రామస్థాయిలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీలదే. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. జిల్లాలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించేందుకు వీబీ జీ రామ్‌జీలో నిధులు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో ఏడు వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో 5 వేలు సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాం. జిల్లాలోని 147 రహదారులను బీటీ రహదారులుగా మారుస్తున్నాం. తాగునీటి సమస్య ఎక్కడున్నా పరిష్కరిస్తాం. ’ అని తెలిపారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.

ఫలించిన నిరీక్షణ

జిల్లాలో 179 అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించి మే నెల 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే నియామకపత్రాలు అందుతాయని అభ్యర్థులు భావించారు. కానీ అనివార్య కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే ఇంటర్వ్యూలు జరిగి సుమారు నాలుగు నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు సోమవారం నియామక పత్రాలు అందించడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 12:06 AM