Share News

‘సవర చిత్రకళకు ప్రభుత్వ ప్రోత్సాహం’

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:21 AM

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే సవర చిత్రకళను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు.

‘సవర చిత్రకళకు ప్రభుత్వ ప్రోత్సాహం’
టూల్‌ కిట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే జయకృష్ణ

సీతంపేట రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే సవర చిత్రకళను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ ప్రాంగణంలో రూ.24 లక్షలతో నిర్మించనున్న కామన్‌ స్పెషిలిటీ సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పీఎం ఆర్‌సీలో సవర చిత్రకళలో శిక్షణ పొందిన 100 మంది అభ్యర్థులకు టూల్‌ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల్లో సవర చిత్రకళకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హ్యాండీ క్రాఫ్ట్‌ ప్రతినిధులు అపర్ణలక్ష్మి, సుధీర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:21 AM