Share News

Welfare Hostels సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:06 AM

Good News for Students of Welfare Hostels జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ల డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వాటిని అమలు చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఏకలవ్య, మోడల్‌ పాఠశాలలు, తదితర గిరిజన విద్యా సంస్థల్లో వసతి పొందుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

  Welfare Hostels సంక్షేమ హాస్టళ్ల  విద్యార్థులకు తీపికబురు
ఓండ్రుజోల ఆశ్రమ పాఠశాలలో భోజనాలు చేస్తున్న విద్యార్థినులు

  • ఈ నెల నుంచే అమలు చేయాలని ఆదేశం

పార్వతీపురం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ల డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వాటిని అమలు చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఏకలవ్య, మోడల్‌ పాఠశాలలు, తదితర గిరిజన విద్యా సంస్థల్లో వసతి పొందుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 3 నుంచి 4వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1150గా ఉన్న డైట్‌ చార్జీని రూ.1265కు, 5 నుంచి 10వ తరగతి వారికి రూ.1400ల నుంచి రూ.1540కు ప్రభుత్వం పెంచింది. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.1600గా ఉన్న మొత్తాన్ని రూ.1760కు పెంచింది. కాగా విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మెనూను నిర్దేశించింది. వారానికి ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్‌, ఏడు రోజులూ పండ్లతోపాటు.. రోజూ పాలు పంపిణీ చేస్తారు. రోజువారీ మెనూలో భాగంగా పూరీ-ఆలూ బఠాణీ కుర్మా, చికెన్‌ బిర్యానీ, ఇడ్లీ-పల్లీ చట్నీ, రాగి లడ్డూ, బగారా రైస్‌-చికెన్‌ కర్రీ, జీరా రైస్‌-వెజిటబుల్‌ కర్రీ, బన్సీ రవ్వ ఉప్మా, వేడి పొంగల్‌, రవ్వ కేసరి తదితర వంటకాలను చేర్చారు. స్నాక్స్‌, పండ్లు, మజ్జిగ వంటి వాటినీ మెనూలో పొందుపరిచారు. అయితే మెనూ అమలుపై పర్యవేక్షణ అవసరమని జిల్లావాసులు భావిస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి శ్యామలను వివరణ కోరగా.. డైట్‌ చార్జీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం మెనూ అమలు చేస్తామని తెలిపారు. డైట్‌చార్జీల పెంపు అభినందనీయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 03 , 2026 | 12:06 AM