Share News

Ration Card Holders రేషన్‌కార్డుదారులకు తీపికబురు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:22 AM

Good News for Ration Card Holders జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని వచ్చేనెల నుంచి డిపోల ద్వారా తక్కువ ధరకు నిత్యావసర సరుకలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

  Ration Card Holders రేషన్‌కార్డుదారులకు తీపికబురు

  • వచ్చేనెల నుంచి అమలు

  • ఆదేశాలు రావాల్సి ఉంది: డీఎం

పాలకొండ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని వచ్చేనెల నుంచి డిపోల ద్వారా తక్కువ ధరకు నిత్యావసర సరుకలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు బియ్యం, చక్కెర, అప్పుడప్పుడు గోధుమపిండి, రాగిపిండిను సరఫరా చేస్తున్నారు. అయితే వచ్చేనెల నుంచి 2027, ఫిబ్రవరి వరకు తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్‌, గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్‌ రూ.125 , కిలో గోధుమపిండి రూ.25 సరఫరా చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఉన్న రెండు లక్షల 83 వేల రైస్‌కార్డుదారులందరికీ లబ్ధి చేకూరనుంది. ‘రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు డిసెంబరు నుంచి రాయితీ ధరలపై నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. జిల్లాలోని గోడౌన్లకు సరుకులు వచ్చిన వెంటనే రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేపడతాం.’ అని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ బాలాజీరాం తెలిపారు.

Updated Date - Nov 15 , 2026 | 12:22 AM