Share News

భీమసింగి కార్మికులకు తీపి కబురు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:18 AM

జిల్లాలోని భీమసింగి చక్కెర కర్మాగార ఉద్యోగులు, కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

భీమసింగి కార్మికులకు తీపి కబురు

విజయనగరం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భీమసింగి చక్కెర కర్మాగార ఉద్యోగులు, కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జీతాలు, వీఆర్‌ఎస్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం రూ.9.12కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ యంతో ఉద్యోగులు, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక క్షోభ అనుభవించారని, దీనిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన స్పందించి బకాయిలు విడుదల చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈసందర్భంగా రైతులు, కార్మికులు.. ముఖ్యమంత్రి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 29 , 2026 | 12:18 AM