Share News

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఆదిలక్ష్మికి బంగారు పతకం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:45 PM

మండలం లోని జోగిరాజుపేట గ్రామానికి చెందిన అట్టాడ ఆదిలక్ష్మి ఆంధ్రా యూనివర్సిటీ పరిధి అంతర్‌ కళాశాలల క్రీడా పోటీల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించింది.

 వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఆదిలక్ష్మికి బంగారు పతకం

నెల్లిమర్ల, నవంబరు 6(ఆంధ్ర జ్యోతి): మండలం లోని జోగిరాజుపేట గ్రామానికి చెందిన అట్టాడ ఆదిలక్ష్మి ఆంధ్రా యూనివర్సిటీ పరిధి అంతర్‌ కళాశాలల క్రీడా పోటీల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించింది. ఈ బాలిక ప్రస్తుతం విజయనగరంలోని సత్యా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో ప్రథమ సంవ త్సరం విద్యను అభ్యసిస్తోంది. విశాఖపట్నం బుల్లయ్య కళాశాల మైదానంలో జరిగిన అంతర్‌ కళాశాల క్రీడల పోటీల్లో 77 కిలోల విభాగంలో పాల్గొన్న ఆదిలక్ష్మి.. ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాప కులు, వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ చల్లా రాము ఆదిలక్ష్మిని అభినందించారు.

Updated Date - Nov 06 , 2026 | 11:45 PM