ఆకుల కోసం మర్రిచెట్టు వద్దకు వెళ్లి..
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:03 AM
చవితిపేట గ్రామంలోని మర్రిబంద చెరువులో ఆదివారం సాయంత్రం కాలు జారి పడి యండ రామారావు (75) అనే వృద్ధుడు మృతి చెందాడు.
కోటబొమ్మాళి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): చవితిపేట గ్రామంలోని మర్రిబంద చెరువులో ఆదివారం సాయంత్రం కాలు జారి పడి యండ రామారావు (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం సాయంత్రం రామారావు త్రినాఽథ స్వామి పూజ కోసం చెరువు గట్టుపై ఉన్న మర్రిచెట్టు నుంచి ఆకులు తీస్తుండగా... ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిపోయాడు. గ్రామస్థులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రామారావును చెరువులో నుంచి బయటకు తీసేసరికే మృతి చెందాడు. మృతునికి భార్య ఉమ, ఇద్దరు కుమారులు సాయి, తేజేశ్వరరావులు ఉన్నారు. మృతుడి భార్య ఉమా ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.