ర్యాలీగా వెళ్లి.. నామినేషన్లు వేసి
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:01 AM
పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.
బెలగాం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. ఆదివారం నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు నామి నేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో అభ్యర్థులు నాలుగు రోడ్ల కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బెలగం కరుణ నామినేషన్ దాఖలు చేయగా, 36 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ స్థానంతో పాటు మొత్తం 36 వార్డుల్లోను కూటమి ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.