Share News

Mahishasuramardini మహిషాసురమర్దినిగా కోటదుర్గమ్మ

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:36 PM

Goddess Kotadurga as Mahishasuramardini శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు సోమవారం కోటదుర్గమ్మ మహిషాసురమర్దినిగా దర్శమిచ్చింది. మహర్నవమి నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. పలువురు ఘటాలు సమర్పించి.. మొక్కులు చెల్లించు కున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

  Mahishasuramardini  మహిషాసురమర్దినిగా కోటదుర్గమ్మ
మహిషాసురమర్దిని అవతారంలో కోటదుర్గమ్మ

పాలకొండ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు సోమవారం కోటదుర్గమ్మ మహిషాసురమర్దినిగా దర్శమిచ్చింది. మహర్నవమి నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. పలువురు ఘటాలు సమర్పించి.. మొక్కులు చెల్లించు కున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో న్యాయ మూర్తికి స్వాగతం పలికారు. అమ్మవారికి గోత్రనామాలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ.. న్యాయమూర్తి దంపతులకు కండువా కప్పి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంణంలో దుశ్శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఇక ఆలయ ప్రాంగణంలో అర్చకులు చండీదేవి పారాయణం, హోమాలు, పంచామృతాభిషేకం, కుంకుమపూజ తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్‌ అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 19 , 2026 | 11:36 PM