Share News

ఉపాధి కోసం వెళ్లి..

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:00 AM

పొట్టచేత్తో పట్టుకుని పక్క జిల్లాకు ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు ఎండవేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజాం మండలం దోసరి గ్రామంలో చోటుచేసుకుంది.

ఉపాధి కోసం వెళ్లి..
బాబి (ఫైల్‌)

- వడదెబ్బతో యువకుడి మృతి

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పొట్టచేత్తో పట్టుకుని పక్క జిల్లాకు ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు ఎండవేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజాం మండలం దోసరి గ్రామంలో చోటుచేసుకుంది. బట్టలు అమ్మితే వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కొడుకు మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలముకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కత్తిరి బాబి (23) ఈనెల 24న పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో వస్త్రాలు అమ్మేందుకు వెళ్లాడు. శుక్రవారం రోజంతా వస్త్రాలు అమ్ముతూ... ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో గుమ్మలక్ష్మీపురంలో సొమ్మసిల్లి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తమ కొడుకుతో ఎవ్వరూ లేకపోవడం.. సకాలంలో వైద్యం అందకపోవడంతో శనివారం వేకువఝామున మృతిచెందినట్లు మృతుడి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మల్లేశ్వరి తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:00 AM