జీవో-396 ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:19 AM
: జీవో -396ని ఉపసంహరించుకోవాలని భోగా పురం దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు జీవో రద్దు చేయాలని బుధవారం పెన్‌డౌన్ చేసి భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్టేషన్, స్టాంపుల శాఖను ప్రభుత్వం ప్రైవేటీకరించి దస్తావేజులేఖర్ల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. కార్యక్రమంలో కోలా మన్మథరావు, ఎస్.శ్రీనివాసరావు, సుదీర్, శేషగిరి, చల్లా గోవిందరావు, మోహన్ పాల్గొన్నారు.
భోగాపురం, జూలై22(ఆంధ్రజ్యోతి): జీవో -396ని ఉపసంహరించుకోవాలని భోగా పురం దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు జీవో రద్దు చేయాలని బుధవారం పెన్‌డౌన్ చేసి భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్టేషన్, స్టాంపుల శాఖను ప్రభుత్వం ప్రైవేటీకరించి దస్తావేజులేఖర్ల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. కార్యక్రమంలో కోలా మన్మథరావు, ఎస్.శ్రీనివాసరావు, సుదీర్, శేషగిరి, చల్లా గోవిందరావు, మోహన్ పాల్గొన్నారు.
ఫచీపురుపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లిలో దస్తావేజు లేఖర్ల నిరసన బుధవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కుప్పిలి కాశీవిశ్వేశ్వరరావు, గంట్యాడ పోతన్న, విష్ణు, బుజ్జి, సూరిబాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.