Share News

జీవో-11 రద్దుచేయాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:12 AM

తమ సమస్యలు పరిష్క రించాలని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

 జీవో-11 రద్దుచేయాలి
నిరసన తెలుపుతున్న స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు :

విజయనగరం కలెక్టరేట్‌ సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్క రించాలని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి కలెక్టరేట్‌ వద్ద స్వర్ణ గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు తమకు సృష్టమైన హామీ ఇచ్చే వరకూ ఇక్కడ నుంచి కదిలేదని ఉద్యోగులు బైఠాయించారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్‌ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి ఎరియర్స్‌ మంజూరుచేయాలని, ఏఏఎస్‌ తక్షణమే అమలుచేయాలని కోరా రు. ప్రొబేషన్‌ ఆలస్యమైన కాలానికి ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని, ప్రతి ఉద్యోగికి మూలవేతనం రూ.30 వేలు తగ్గకుండా ప్రమోషన్‌ చానల్‌ కల్పించా లని, జీవో-11ను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. జాయింట్‌ స్టాప్‌ కౌన్సిల్‌లో ఎస్‌జీ ఎస్‌డబ్య్లూ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిద్యం కల్పించాలని కోరారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిరసన కొనసాగించారు.

Updated Date - Sep 10 , 2026 | 12:12 AM