తోటపల్లికి నిధులివ్వండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:08 AM
తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికతీతకు తక్షణమే రూ.20 కోట్లు మంజూరు చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
చీపురుపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికతీతకు తక్షణమే రూ.20 కోట్లు మంజూరు చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రిని కలిసి, పలు సమస్య లపై వినతిపత్రం సమర్పించారు. వైసీపీ హ యంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. ఈ సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నట్టు ఎమ్మెల్యే తెలిపారు.